Header Banner

తిరుమల బ్రేక్ దర్శనాల్లో మార్పులు.. భక్తులకు అధునాతన సేవలు! మరి ఎన్నారైల కోటా?

  Mon Mar 31, 2025 08:51        Devotional

టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవిలో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా కొన్ని నిర్ణయాల అమలుకు సిద్దమైంది. బ్రేక్ దర్శనాల విషయంలో మార్పులు చేయనుంది. ఇక, భక్తులకు ఏఐ సాంకేతికతతో దర్శనం .. వసతి అమలుకు వీలుగా గుగూల్ తో ఒప్పందానికి కస రత్తు జరుగుతోంది. ఇక, ఈ వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ల సిఫారసు లేఖలను రద్దు చేయాలని భావిస్తోంది. బ్రేక్ దర్శనాల వేళల మార్పు పైలెట్ ప్రాజెక్టు కింద అమలు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కీలక నిర్ణయాలు
టీటీడీ కొత్త నిర్ణయాల అమలుకు కసరత్తు చేస్తోంది. తిరుమలలో బ్రేక్ దర్శనాల కోసం ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఆమోదిస్తుండటంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో, సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతా యని గుర్తించారు. దీంతో, బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే వారం నుంచి శని, ఆది వారాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రోజులు కావటంతో గతంలో నిర్వహించిన విధంగా ఉదయం ఆరు గంటల నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.


ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!


బ్రేక్ కోసం సిఫార్సులు
కొద్ది రోజుల క్రితం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం అమలుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం తిరుమలలో ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్‌ దర్శనాలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఏఎస్‌, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంవోలు.. ఇలా మరో వెయ్యి నుంచి 1,500, టీటీడీ బోర్డు చైర్మన్‌, సభ్యులకు 580, స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి మరో 600 టికెట్లు, శ్రీవాణిట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు 1,500 బ్రేక్‌ టికెట్లు ఇస్తున్నారు. ఇలా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటు న్నట్లు చెబుతున్నారు.
బ్రేక్ దర్శనాల్లో మార్పు
దీంతో, బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే సమయంలో వేసవి రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. కొందరి సిఫారసు లేఖలను రద్దీ కాలం పూర్తయ్యే వరకూ రద్దు చేయాలని భావిస్తోంది. దీంతో.. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారు లు, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నారని తెలుస్తోంది. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశం పైన టీటీడీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకే సారి రద్దు చేయ కుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆస్థానం.. 7న పట్టాభిషేకం నిర్వహణకు నిర్ణయించారు.

అలాగే ఇటీవల ప్రభుత్వం ఎన్నారైలకు రోజుకు 100 వీఐపీ దర్శనాలు అందిస్తూ జీఓ జారీ చేయడం జరిగింది. కానీ అది ఇంతవరకూ అమలులోకి రాలేదు. మే, జూన్ నెలలలో ఎక్కువమంది ఎన్నారైలు ఇండియా వస్తారు. అదే సమయంలో వారికి వీఐపీ దర్శనం అందుబాటులో ఉంటే బాగుంటుందని అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తునారు. కానీ ఎప్పుడు అమలు అవుతుంది అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirumala #TTD #BreakDarshan #TTDDecisions #DevoteeServices #Tirupati #TempleUpdates